venkatesh: ఈసారి రవితేజతో కలసి... మరో మల్టీస్టారర్ మూవీలో వెంకీ?

  • మల్టీస్టార్ మూవీలతో దూసుకుపోతున్న వెంకీ
  • వెంకీ కోసం మల్టీస్టారర్ కథను సిద్ధం చేసిన వీరు పోట్ల
  • వెంకీతో కలసి రవితేజ నటించబోతున్నట్టు సమాచారం

మల్టీస్టారర్ మూవీలతో వెంకటేశ్ దూసుకుపోతున్నారు. మహేశ్ బాబుతో కలసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', పవన్ కల్యాణ్ తో కలసి 'గోపాల గోపాల', తాజాగా వరుణ్ తేజ్ తో కలసి ఆయన చేసిన 'ఎఫ్2' సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో, మరిన్ని మల్లీస్టారర్ మూవీలు చేసేందుకు వెంకటేశ్ మొగ్గు చూపుతున్నారు.

తాజాగా, దర్శకుడు వీరు పోట్ల వెంకీ కోసం ఓ మల్టీ స్టారర్ కథను సిద్ధం చేశాడట. ఈ చిత్రంలో వెంకీతో కలసి రవితేజ నటించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం చర్చల దశలోనే ఉంది. త్వరలోనే దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది. మరోవైపు, నాగచైతన్యతో కలసి వెంకీ ప్రస్తుతం 'వెంకీ మామ' అనే చిత్రంలో నటిస్తున్నారు.

venkatesh
raviteja
multi starrer
tollywood
  • Loading...

More Telugu News