Chandrababu: దొంగ సర్వేలతో తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరు: చంద్రబాబు

  • గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చాం
  • అందువల్ల ఏకపక్ష విజయం తధ్యం
  • పార్టీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్‌

అభ్యర్థులను వడపోసి ఏకాభిప్రాయంతో ఎంపిక చేసిన గెలుపు గుర్రాలకే అన్ని నియోజకవర్గాల్లో టికెట్లు ఇచ్చామని, తెలుగుదేశం పార్టీ విజయం ఇక ఏకపక్షమేనని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. దొంగ సర్వేలతో ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎంత వ్యూహాత్మకంగా వ్యహరించినా మన విజయాన్ని ఆపలేరని తెలిపారు. ఈరోజు ఉదయం ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందిన ప్రతి లబ్ధిదారు సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని కసి, పౌరుషంతో ఎదురు చూస్తున్నారని, పార్టీ పట్ల ఉన్న సానుకూలతను ఏ శక్తులూ తగ్గించలేవన్నారు.

నామినేషన్‌ వేసే అభ్యర్థులు అప్రమత్తంగా వ్యవహరించాలని, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఒకటికి పదిసార్లు చెక్‌ చేసుకోవాలని సూచించారు. వీవీ ప్యాట్లపై అవగాహన పెంచుకోవాలని, పోలింగ్‌ ముగిసే వరకు అప్రమత్తంగా ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీ ఎన్ని ఆరాచకాలకైనా పాల్పడే అవకాశం ఉందని, అందువల్ల కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

Chandrababu
teliconference
Telugudesam win
  • Loading...

More Telugu News