Jana Sena: తెలుగుదేశం ఎమ్మెల్యే ఇంటికి జనసేన అమలాపురం ఎంపీ అభ్యర్థి!

  • అమలాపురం నుంచి జనసేన అభ్యర్థిగా డీఎంఆర్ శేఖర్
  • పీ గన్నవరం ఎమ్మెల్యే నారాయణమూర్తి ఇంటికి
  • జనసేనలో చేరాలని ఆహ్వానం

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను జనసేన ఎంపీ అభ్యర్థి కలవటం తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. పీ గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ఇంటికి వచ్చిన అమలాపురం లోక్ సభ జనసేన అభ్యర్థి డీఎంఆర్‌ శేఖర్‌, ఆయనతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. జనసేన పార్టీలోకి రావాలని ఆహ్వానించిన శేఖర్, పార్టీలో మంచి స్థానం ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. జనసేన అధికారంలోకి వస్తే ఉన్నత పదవిని కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, నారాయణమూర్తి మాత్రం ఏ విషయం చెప్పకుండా, తన అనుచరులు, కార్యకర్తలతో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేసినట్టు సమాచారం.

Jana Sena
Telugudesam
DMR Shekar
P Gannavaram
P Narayanamurty
  • Loading...

More Telugu News