Jana Sena: జనసేన నుంచి మూడో జాబితా.. అర్ధరాత్రి ప్రకటించిన అధినేత

  • 13 మంది శాసనసభ అభ్యర్థులు
  • ఒంగోలు లోక్‌‌సభ స్థానానికి అభ్యర్థుల ప్రకటన
  • షేక్ రియాజ్ స్థానం మార్పు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం అర్ధరాత్రి ఏపీ శాసనసభలో బరిలోకి దిగబోతున్న మరో 13 మంది అభ్యర్థులతోపాటు ఓ లోక్‌సభ అభ్యర్థిని కూడా ప్రకటించారు. అలాగే ఆదివారం విడుదల చేసిన రెండో జాబితాలోని ఓ అభ్యర్థి స్థానాన్ని మార్చారు. గిద్దలూరు నుంచి పోటీ చేస్తారని ప్రకటించిన షేక్ రియాజ్ ఒంగోలు నుంచి పోటీ చేయనుండగా, గిద్దలూరు నుంచి బైరబోయిన చంద్రశేఖర్‌ యాదవ్‌ పోటీ చేస్తారని పవన్ ప్రకటించారు.  
పవన్ ప్రకటించిన మూడో జాబితా ప్రకారం..

కణితి కిరణ్ కుమార్ (టెక్కలి), గుణ్ణం నాగబాబు(పాలకొల్లు), షేక్‌ జియాఉర్‌ రెహ్మాన్‌ (గుంటూరు తూర్పు), కమతం సాంబశివరావు (రేపల్లె), మిరియాల రత్నకుమారి (చిలకలూరిపేట), కె.రమాదేవి (మాచర్ల), పులుగు మధుసూదన్‌రెడ్డి ( బాపట్ల), షేక్‌ రియాజ్‌ (ఒంగోలు), ఇమ్మడి కాశీనాథ్‌ (మార్కాపురం), బైరబోయిన చంద్రశేఖర్‌యాదవ్‌ (గిద్దలూరు), ఇంజా సోమశేఖర్‌రెడ్డి (ప్రొద్దుటూరు), కేతంరెడ్డి వినోద్‌రెడ్డి (నెల్లూరు సిటీ), పందింటి మల్హోత్రా (మైదుకూరు), సాడగల రవికుమార్‌ (వడ్డే రవిరాజు-కదిరి), బెల్లంకొండ సాయిబాబా (ఒంగోలు -లోక్‌సభ)

Jana Sena
Pawan Kalyan
Andhra Pradesh
Assembly list
Ongole Lok sabha
  • Loading...

More Telugu News