Srikakulam District: ఎన్నికల ప్రచారం చేస్తూ సొమ్మసిల్లిపడిపోయిన వైసీపీ నేత ధర్మాన

  • ఆత్మీయ కలయిక కార్యక్రమంలో ఘటన
  • సొమ్మసిల్లి పడిపోవడంతో కార్యక్రమంలో కలకలం
  • తీవ్ర జ్వరం వల్లేనన్న వైద్యులు

ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య నేత ధర్మాన ప్రసాదరావు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో కార్యక్రమంలో ఒక్కసారి కలకలం రేగింది. ఏం జరిగిందో అర్థంకాక కార్యకర్తలు అయోమయానికి లోనయ్యారు. వెంటనే అక్కడకు చేరుకున్న వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి తరలించారు. తీవ్ర జ్వరం కారణంగా కళ్లు తిరిగి పడిపోయారని, భయపడాల్సింది ఏమీ లేదని వైద్యులు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  

Srikakulam District
YSRCP
Dharmana Prasad
Elections
Andhra Pradesh
canvassing
  • Loading...

More Telugu News