Telugudesam: రాబోయే రెండేళ్లలో ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’ పనులు పూర్తి చేస్తాం: కేటీఆర్
- నాగోల్ లో భువనగిరి పారిశ్రామిక ప్రగతి నివేదన సభ
- ఎలాంటి కాలుష్యం లేకుండా ఈ సిటీని ఏర్పాటు చేస్తాం
- మరిన్ని పరిశ్రమలు ఈ ప్రాంతానికి రావాలి: కేటీఆర్
రాబోయే రెండేళ్లలో ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’ పనులు పూర్తి చేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. నాగోల్ లో భువనగిరి పారిశ్రామిక ప్రగతి నివేదన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, 19 వేల ఎకరాల్లో ఎలాంటి కాలుష్యం లేకుండా ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’ని ఏర్పాటు చేస్తామని అన్నారు. మరిన్ని పరిశ్రమలు ఈ ప్రాంతానికి రావాలని కోరుకుంటున్నానని, తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ శివారులో త్వరలోనే ఫర్నీచర్ పార్క్ ను ఏర్పాటు చేయనున్నామని, దేశంలోనే అతిపెద్ద డ్రైపోర్ట్ ను నకిరేకల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని అన్నారు.