Andhra Pradesh: టీడీపీకి మరో షాక్.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా: శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బుడ్డా

  • ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
  • నా భార్య అనారోగ్యంతో ఉంది
  • అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా

నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ తరపున సీటు దక్కినప్పటికీ ఆ పార్టీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి బయటకొచ్చి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా, టీడీపీకి చెందిన మరో అభ్యర్థి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నానని కర్నూలు జిల్లా శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. తన భార్య శైలజ అనారోగ్యంతో ఉన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు తనను క్షమించాలని కోరారు. అయితే, రాజశేఖర్ రెడ్డి వైఖరి పట్ల టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల్పనూరులోని ఆయన నివాసం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. రాజశేఖర్ రెడ్డి తన నిర్ణయం విషయమై పునరాలోచించుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా, శ్రీశైలం ప్రస్తుత ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత, టీడీపీలో చేరారు. ఈసారి టీడీపీ తరపున టికెట్ లభించినప్పటికీ ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.  

Andhra Pradesh
srisailam
Telugudesam
candidate
budda
  • Loading...

More Telugu News