avinash reddy: వివేకా హత్య కేసు.. వైయస్ అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తున్న పోలీసులు

  • కాసేపటి క్రితం పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి వచ్చిన అవినాష్
  • కొనసాగుతున్న విచారణ
  • ఇప్పటికే 20 మందిని విచారించిన సిట్ అధికారులు

వైయస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు విచారణను సిట్ అధికారులు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా కడప వైసీపీ మాజీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. కాసేపటి క్రితం పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి అవినాష్ వచ్చారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

మరోవైపు, ఈ కేసు విచారణ కోసం సిట్ ఐదు బృందాలను నియమించింది. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కేసును ఛేదించే పనిలో ఈ టీమ్ లు ఉన్నాయి. ఇప్పటికే 20 మందిని పోలీసులు విచారించి, వారి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నిన్న వివేకా సోదరులు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, బావమరిది శివప్రకాష్ రెడ్డి, జగన్ అనుచరుడు శంకర్ రెడ్డిని విచారించారు. దర్యాప్తులో భాగంగా వీరికి పలు ప్రశ్నలను పోలీసులు సంధించినట్టు సమాచారం.

avinash reddy
ys
viveka
murder
examination
  • Loading...

More Telugu News