anathapuram: పని లేకపోవడం వల్లే ఏపీ యువత పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్నారు: వైఎస్ జగన్ విమర్శలు

  • ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు
  • అందుకే, ఇక్కడి యువత వలసపోతున్నారు
  • ఎన్నికల ముందు బాబు మోసపు మాటలు నమ్మొద్దు

ఏపీలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని, అందుకే, ఇక్కడి యువతకు పనిలేక పోవడంతో పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్నారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైసీపీ నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, యువతకు తాను అండగా ఉంటానని భరోసా ఇస్తున్నానని అన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి వస్తే ‘నవరత్నాలు’ ఇస్తామని ప్రతి ఇంట్లో ప్రచారం చేయాలని పిలుపు నిచ్చారు. రైతులను ఐదేళ్ల పాటు చంద్రబాబు మోసం చేశారని, ఎన్నికల ముందు బాబు చెప్పే మోసపు మాటలు నమ్మొద్దని అన్నారు. 

anathapuram
rayadurgam
YSRCP
jagan
babu
  • Loading...

More Telugu News