srikanth naidu: పలమనేరు అభ్యర్థి పేరును సరి చేసిన జనసేన

  • నిన్న అర్ధరాత్రి అభ్యర్థుల జాబితా విడుదల చేసిన జనసేన
  • పోలూరు శ్రీకాంత్ నాయుడు పేరులో తప్పిదం
  • తప్పును సవరించిన జనసేన

చిత్తూరు జిల్లా పలమనేరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోలూరు శ్రీకాంత్ నాయుడు ఎన్నికల బరిలోకి దిగనున్నారని జనసేన ప్రకటించింది. శ్రీకాంత్ నాయుడు పేరును హైకమాండ్ ఖరారు చేసిందని తెలిపింది. నిన్న అర్ధరాత్రి విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో శ్రీకాంత్ నాయుడు పేరు సరిగా ముద్రితం కాలేదని ప్రకటించింది. జనసేన ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో కూడా జనసేన రంగంలోకి దిగుతోంది. 

srikanth naidu
palamaner
janasena
  • Loading...

More Telugu News