panabaka lakhsmi: తిరుపతి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు

  • టీడీపీలో చేరిన పనబాక లక్ష్మి దంపతులు
  • టీడీపీ ఎంపీ టికెట్ ను ప్రకటించిన చంద్రబాబు
  • 2004-14 మధ్య కాలంలో కేంద్ర మంత్రిగా పని చేసిన పనబాక

తిరుపతి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈరోజు నెల్లూరులో జరిగిన సభలో పనబాక లక్ష్మి దంపతులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఆమె పేరును తిరుపతి పార్లమెంటు స్థానానికి చంద్రబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి పక్క పార్టీతో లాలూచీ పడ్డారని మండిపడ్డారు.

11, 12, 14వ లోక్ సభలకు నెల్లూరు నుంచి... 15వ లోక్ సభకు బాపట్ల నుంచి పనబాక లక్ష్మి ప్రాతినిధ్యం వహించారు. 2004-09 వరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా... 2009-14 మధ్య కాలంలో పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రిగా, కేంద్ర టెక్స్ టైల్ శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు.

panabaka lakhsmi
chandrababu
tirupati
mp
ticket
Telugudesam
  • Loading...

More Telugu News