parashuram: మహేశ్ బాబుకు లైన్ చెప్పి మెప్పించిన పరశురామ్

  • మహేశ్ బాబుపై దృష్టి పెట్టిన పరశురామ్ 
  • కథపై కొనసాగుతోన్న కసరత్తు 
  • గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే నిర్మాణం  

పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన 'గీత గోవిందం' అటు యూత్ ను .. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ కెరియర్లోనే భారీ విజయాన్ని అందించింది. గీతా ఆర్ట్స్ వారికి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. దాంతో చాలా మంది యువ కథానాయకులు పరశురామ్ తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే పరశురామ్ మాత్రం ఏకంగా మహేశ్ బాబుపైనే దృష్టి పెట్టాడు.

అల్లు అరవింద్ సిఫార్స్ మేరకు తాజాగా మహేశ్ బాబును కలిసిన పరశురామ్, ఆయనకి  ఒక లైన్ వినిపించాడట. లైన్ బాగుండటంతో .. పూర్తి కథను సిద్ధం చేసి వినిపించమని మహేశ్ బాబు అన్నట్టుగా తెలుస్తోంది. దాంతో కథపై పరశురామ్ కసరత్తు చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. కథ నచ్చకపోవడం వల్లనే సుకుమార్ ప్రాజెక్టును మహేశ్ బాబు పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే. అందువలన కథపై పరశురామ్ పూర్తి శ్రద్ధ పెట్టాడట. మహేశ్ బాబు ఓకే అంటే గీతా ఆర్ట్స్ పైనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది.

parashuram
Mahesh Babu
  • Loading...

More Telugu News