Congress: ఏపీలో 136 సీట్లకు ఖరారైన కాంగ్రెస్ అభ్యర్థులు!

  • రెండు రోజుల నుంచి ఢిల్లీలో నేతల మకాం
  • హైకమాండ్ ఆమోదం పడగానే వెల్లడి
  • నేడు లేదా రేపు అధికారిక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 136 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీ తరఫున పోటీ పడే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. రెండు రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేసిన రాష్ట్ర నేతలు, అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు. నేటి సాయంత్రం లేదా రేపు తమ తొలి జాబితా విడుదలవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో ఏపీలో 13 లోక్ సభ స్థానాలకు, తెలంగాణలో మిగిలిన 9 స్థానాలకు నేటి సాయంత్రంలోగా అభ్యర్థులను ఖరారు చేసే లక్ష్యంతో అధిష్ఠానం ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆమోదముద్ర వేయించుకున్న తరువాత లిస్ట్ ను విడుదల చేస్తామని పార్టీ నాయకుడొకరు తెలిపారు. 

Congress
Andhra Pradesh
Candidates
Telangana
  • Loading...

More Telugu News