Konatala Ramakrishna: శనివారం వైసీపీలో చేరిన కొణతాల రామకృష్ణ... కొద్దిసేపటి క్రితం చంద్రబాబుతో చర్చలు!

  • శనివారం నాడు జగన్ వద్దకు వచ్చిన కొణతాల
  • అనకాపల్లి టికెట్ ను కేటాయించని జగన్
  • పార్టీ మారే ఆలోచనలో విశాఖ సీనియర్ నేత

సరిగ్గా రెండు రోజుల క్రితం బుట్టా రేణుక, మాగుంట శ్రీనివాసులరెడ్డి, వంగా గీత తదితరులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొణతాల రామకృష్ణ, అనూహ్యంగా ఈ ఉదయం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యారు. అనకాపల్లి నుంచి ఎంపీ టికెట్ ను ఆశించిన ఆయన, జగన్ తిరస్కరించడంతో ఇప్పుడు పార్టీ మారాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

చంద్రబాబు, కొణతాల మధ్య ఏఏ అంశాలపై చర్చలు జరిగాయన్న విషయం బయటకు రాలేదుగానీ, ఆయన అభిమానులు అందించిన వివరాల మేరకు, నేడో, రేపో కొణతాల పచ్చ కండువాను కప్పుకోనున్నారు. కొణతాల చేరితే సరైన ప్రాతినిధ్యం ఇస్తామని, ఆయన సేవలను వినియోగించుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొణతాల, ఆపై పార్టీని వీడి, రెండు రోజుల క్రితం తిరిగి అదే పార్టీకి వచ్చిన సంగతి తెలిసిందే.

Konatala Ramakrishna
Jagan
Chandrababu
  • Loading...

More Telugu News