YS Viveka: వివేకా హత్య జరిగిన రోజు నుంచి కనిపించకుండాపోయిన పరమేశ్వర్ రెడ్డి!

  • వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే పరమేశ్వర్ రెడ్డి
  • ఆయన కోసం గాలిస్తున్న పోలీసులు
  • ప్రత్యేక బృందాల ఏర్పాటు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే కుసునూరి పరమేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి, వివేకా హత్య జరిగిన నాటి నుంచి అదృశ్యమయ్యాడు. వివేకా అనుచరుడు గంగిరెడ్డి ఇచ్చిన వివరాలతో పరమేశ్వరరెడ్డిని విచారించాలని పోలీసులు భావించిన వేళ, ఆయన పరారీలో ఉన్నట్టు తేలింది. దీంతో పరమేశ్వర్ ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ 10 మంది అనుమానితులను ప్రశ్నించిన పోలీసులు, హత్య ఎలా జరిగింది? ఎవరు చేశారన్న విషయాలపై ఇంకా ఓ అంచనాకు రాలేదు. కేసును అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నామని అధికారులు అంటున్నారు.

కాగా, పులివెందులకే చెందిన కుసునూరు పరమేశ్వర్ రెడ్డికి గతంలో నేరచరిత్ర ఉంది. ఆయనపై హత్య సహా పలు కేసులు ఉన్నాయి. వివేకాకు ఆయన సన్నిహితుడేనని తెలుస్తోంది. ఆయన హత్య జరుగగానే పరమేశ్వర్ రెడ్డి మాయం కావడం గమనార్హం. ఇప్పుడు పరమేశ్వర్ రెడ్డికి వివేకా హత్యతో సంబంధం ఉందా? అనే యాంగిల్ లో పోలీసులు కూపీ లాగుతున్నారు.

YS Viveka
Parameshwar Reddy
Escape
Murder
  • Loading...

More Telugu News