bellamkonda: గజదొంగ బయోపిక్ లో పాయల్ రాజ్ పుత్

  • తెలుగు తెరపైకి మరో బయోపిక్ 
  • టైటిల్ గా 'టైగర్ నాగేశ్వరరావు'
  • త్వరలోనే సెట్స్ పైకి    

'ఆర్ ఎక్స్ 100' సినిమాలో అందాలను ఆరబోసిన పాయల్ రాజ్ పుత్, కుర్రకారు మనసులను దోచేసింది. యూత్ లో ఆమెకి గల క్రేజ్ .. వరుస అవకాశాలను తెచ్చిపెడుతోంది. అలా తాజాగా ఆమె మరో సినిమాలో చేయడానికి అంగీకారాన్ని తెలిపినట్టుగా సమాచారం.

దర్శకుడు వంశీకృష్ణ .. 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. 1980 - 90లలో స్టూవర్టుపురం గజదొంగగా 'టైగర్ నాగేశ్వరరావు' ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. దొంగతనాలు చేయడంలో మంచి నేర్పరి అయిన ఆయన, పోలీసువారికి పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. అలాంటి ఆయన బయోపిక్ లో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించనున్నాడు. ఆయన జోడీగా పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్నారు. బుర్రా సాయిమాధవ్ ఈ సినిమాకి సంభాషణలను సమకూర్చుతున్నాడు. 

bellamkonda
payal
  • Loading...

More Telugu News