Crime News: నకిలీ ప్రొఫైల్ ను నమ్మి.. లక్ష రూపాయలు సమర్పించుకున్న యువతి!

  • న్యూఢిల్లీలో ఘటన
  • ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు
  • అరెస్ట్ చేసిన పోలీసులు

తాను ఒక ఐపీఎస్ ఆఫీసర్ నని, తప్పుడు ప్రొఫైల్ పెట్టుకున్న యువకుడిని నమ్మిన ఓ యువతి మోసపోయింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, రాజ్ అనే యువకుడు తాను ఐపీఎస్ అధికారినని సామాజిక మాధ్యమాల్లో ఫేక్ ప్రొఫైల్ పెట్టుకున్నాడు.

దర్జాగా పోలీసు దుస్తుల్లో కనిపిస్తున్న అతన్ని చూసిన ఓ యువతి అతనితో మాట్లాడింది. ఢిల్లీలోని ఓ జిమ్ లో అతన్ని పరిచయం చేసుకోగా, ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. దీంతో ఆమె లక్ష రూపాయల డబ్బు అతనికి ఇచ్చింది. ఆపై ఎంతకాలానికీ ఉద్యోగం రాకపోవడంతో, అతను మోసగాడని, నకిలీ అధికారిగా చెప్పుకున్నాడని గుర్తించిన ఆమె, పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, రాజ్ ను కటకటాల వెనక్కు పంపారు.

Crime News
New Delhi
Fake Profile
Govt. Job
  • Loading...

More Telugu News