Mali: మాలిలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 21 మంది సైనికులు మృతి
- సైనిక స్థావరంపై దాడి చేసిన ఉగ్రవాదులు
- దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అధ్యక్షుడు
- ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు ఒక్కటి కావాలని పిలుపు
ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 21 మంది సైనికుల ప్రాణాలను బలితీసుకున్నారు. సెంట్రల్ మాలిలోని సైనిక స్థావరంపై ఆదివారం జరిగిన ఈ దాడితో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లలో వచ్చిన దుండగులు దియౌరాలోని సైనిక స్థావరంపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 21 మంది సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు సైనిక వర్గాలు తెలిపాయి. ఉగ్రదాడిపై స్పందించిన అధ్యక్షుడు ఇబ్రహీం బౌబకార్ కిటా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.