Gorantla Butchaiah Chowdary: బాబాయిని హతమార్చి ఎన్నికలు ఆపేందుకు కుట్ర: జగన్‌పై గోరంట్ల తీవ్ర వ్యాఖ్యలు

  • కోడికత్తి ఎపిసోడ్ ఫెయిలైందని కొత్త డ్రామా
  • సొంతమీడియాలో వివేకా గుండెపోటుతో మరణించారని చూపించారు
  • ఇక్కడి ప్రజల కంటే ఏపీని మోసం చేసిన మోదీ, కేసీఆర్‌లపైనే జగన్‌కు నమ్మకం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడికత్తి ఎపిసోడ్ ఫెయిలైందన్న ఆక్రోశంతో బాబాయిని హత్య చేయించి బీజేపీతో కలిసి ఎన్నికలను ఆపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.

వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తు కోరుతున్న జగన్ తన సొంత మీడియాలో వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని ఎందుకు చూపించారని ప్రశ్నించారు. వివేకా హత్య జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసిందన్నారు. ఇక్కడి ప్రభుత్వం, పోలీసులతోపాటు ఇక్కడి ప్రజలపైనా జగన్‌కు నమ్మకం లేదన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ, కేసీఆర్‌లపైనే జగన్‌కు ఎక్కువ నమ్మకమని ఎద్దేవా చేశారు. ప్రజలు జగన్‌కు బుద్ధి చెప్పే రోజు అతి దగ్గర్లోనే ఉందని గోరంట్ల హెచ్చరించారు.  

Gorantla Butchaiah Chowdary
Telugudesam
Rajamahendravaram
Andhra Pradesh
YSRCP
Jagan
YS Vivekanandareddy
  • Loading...

More Telugu News