Jagan: వివేకా హత్య విషయంలో మాకు ఎవరిపైనా అనుమానాల్లేవు: సోదరుడు ప్రతాప్ రెడ్డి

  • సోదరుడి సంచలన వ్యాఖ్యలు 
  • సీబీఐ దర్యాప్తు కోరడంలో అర్థం లేదు
  • రాజకీయంగా చాలామంది చాలా మాట్లాడతారు

వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన సోదరుడు వైఎస్ ప్రతాప్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో ఎవరిపైనా అనుమానాల్లేవని ఆయన పేర్కొన్నారు. వివేకా హత్యను సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న జగన్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. రాజకీయంగా చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారని, సీబీఐ విచారణ కోరడం రాజకీయంగా చేసిన వ్యాఖ్యలు కావొచ్చంటూ కొట్టిపడేశారు. రాజకీయాలతో తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు. మైనింగ్ ఆర్థిక లావాదేవీల విషయంలో వివేకానందరెడ్డి తన ఇంటి ముందు ధర్నా చేయడం నిజమేనని, అయితే, దీనికి హత్యకు ఎటువంటి సంబంధం లేదని ప్రతాప్‌రెడ్డి స్పష్టం చేశారు.

Jagan
YS Vivekanandareddy
YS pratap Reddy
Murder
Pulivendula
  • Loading...

More Telugu News