Ravi Ramanatham Babu: టీడీపీలో చేరనున్న పర్చూరు వైసీపీ నేత!

  • భగ్గుమన్న అసమ్మతి సెగలు
  • టికెట్ ఆశించి భంగపడ్డ రామనాథం బాబు
  • పార్టీని వీడాలని నిర్ణయం

వైసీపీ అభ్యర్థుల జాబితాను వెల్లడించడంతో అసమ్మతి సెగలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. టికెట్ దక్కని నేతలంతా అసంతృప్తితో తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరు సమన్వయకర్తగా ఉన్న రావి రామనాథంబాబు తన నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ టికెట్‌ను వైసీపీ అధినేత జగన్.. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు కేటాయించడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో టీడీపీ కండువా కప్పుకోనున్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.

Ravi Ramanatham Babu
YSRCP
Jagan
Daggubati Venkateswara Rao
Telugudesam
  • Loading...

More Telugu News