East Godavari District: నెలరోజులు ఓపిక పట్టండి, రాజన్న రాజ్యాన్ని జగనన్న పాలనలో చూస్తారు: వైసీపీ అధినేత జగన్

  • ఐదేళ్ల పాటు చంద్రబాబును నమ్మితే మోసం చేశారు
  • ఒక్కసారి, నాకు అవకాశమివ్వండి
  •  వైసీపీకి ఓట్లు వేయండి

నెలరోజులు ఓపిక పట్టండి, రాజన్న రాజ్యాన్ని జగనన్న పాలనలో చూస్తారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఐదేళ్ల పాటు చంద్రబాబును నమ్మితే, అడ్డగోలుగా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఒక్కసారి, తనకు అవకాశమివ్వాలని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. అబద్ధాలు చెప్పే వారిని, మోసం చేసేవారిని బంగాళాఖాతంలో కలపాలని, ఈ వ్యవస్థను బాగుపరిచే నిమిత్తం త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేయాలని అన్నారు.

East Godavari District
ambajipeta
YSRCP
jagan
  • Loading...

More Telugu News