Suresh: 'అరటితోట దగ్ధం' కేసుతో వెలుగులోకి వచ్చిన వ్యక్తికి బాపట్ల వైసీపీ ఎంపీ టికెట్!

  • సురేష్ పేరును ఖరారు చేసిన జగన్
  • సంచలనం సృష్టించిన అరటితోట దగ్ధం కేసు
  • ఆ సమయంలోనే వైసీపీకి దగ్గరయ్యారు

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించిన పూర్తి జాబితాను నేడు అధిష్ఠానం ప్రకటించింది. అయితే గుంటూరు జిల్లాలలోని బాపట్ల ఎస్సీ రిజర్వుడ్ లోక్‌సభ స్థానానికి రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలేనికి చెందిన నందిగం సురేష్ పేరును వైసీపీ అధినేత జగన్ ఖరారు చేశారు. అయితే ఈ సురేష్ ఎవరనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన 9 మంది పేర్లలో తొలిపేరు సురేష్‌దే కావడం విశేషం. ఉద్దండరాయుని పాలెంలో అరటితోట దగ్ధం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో సురేష్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ సమయంలోనే సురేష్ వైసీపీకి చాలా దగ్గరయ్యారు. మొదట వైసీపీ యువజన విభాగం నాయకుడిగా కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు బాపట్ల ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.

Suresh
YSRCP
Jagan
Uddandarayunipalem
Bapatla
Guntur District
  • Loading...

More Telugu News