Chandrababu: అక్కడ 10 లక్షల మంది అలెగ్జాండర్లు ఉంటే ఇక్కడ 65 లక్షల మంది చంద్రబాబులు ఉన్నారు: చంద్రబాబు సమరోత్సాహం

  • రాష్ట్రం మొత్తం టీడీపీ గాలి వీస్తోంది
  • ఏ శక్తీ టీడీపీ గెలుపును ఆపలేదు
  • తప్పు చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. మధ్యాహ్నం విజయనగరం, విశాఖపట్నం సభల్లో పాల్గొన్న ఆయన సాయంత్రం కాకినాడ ఎన్నికల సన్నాహక సభలో నిప్పులు చెరిగేలా ప్రసంగించారు. రాష్ట్రం మొత్తం టీడీపీ గాలి వీస్తోందని, ఏ శక్తీ టీడీపీని ఆపలేదని స్పష్టం చేశారు. ఏపీలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం మరే రాష్ట్రంలోనూ జరగలేదని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని అన్నారు. అలెగ్జాండర్ మహాచక్రవర్తికి 10 లక్షల మంది సైనికులు ఉంటే టీడీపీకి 65 లక్షల మంది చంద్రబాబులు ఉన్నారని, ప్రతి కార్యకర్త తన స్ఫూర్తిని అందుకుని ముందుకు పోవాలని పిలుపునిచ్చారు టీడీపీ అధినేత.

"ఒక సమర్థవంతమైన సైన్యం మనవద్ద ఉంది. అలెగ్జాండర్ చక్రవర్తిని మీరు ఎలా ప్రపంచాన్ని జయిస్తున్నారని అడిగితే ఆయన నా వద్ద 10 లక్షల మంది సైనికులున్నారని చెప్పాడు. కానీ, నా వద్ద 65 లక్షల మంది సైనికులు ఉన్నారు. అక్కడ 10 లక్షల మంది అలెగ్జాండర్లు ఉంటే నా దగ్గర 65 లక్షల మంది చంద్రబాబులు ఉన్నారు... అదీ నా ధైర్యం. కార్యకర్తలను చూస్తే ఎక్కడలేని శక్తి వస్తుంది" అంటూ కార్యకర్తలను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు చంద్రబాబు.

అంతేకాకుండా, తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. "తమ్ముళ్లూ! హైదరాబాద్ ను ఎవరు డెవలప్ చేశారు? ఎయిర్ పోర్టు నిర్మాణం ఎవరు ప్రారంభించారు? సైబరాబాద్ అని ఎవరు పేరు పెట్టారు? అవుటర్ రింగ్ రోడ్డు ఎవరిది? హైదరాబాద్ లో మనమే సంపద సృష్టించాం. ఈ కేసీఆర్ ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డాడా! నా దగ్గర పనిచేసినవాడు నా మీదనే దౌర్జన్యాలు చేసే స్థాయికి ఎదిగాడా! ఖబడ్దార్ కేసీఆర్!" అంటూ తీవ్రస్వరంతో హెచ్చరించారు చంద్రబాబునాయుడు.

  • Loading...

More Telugu News