t-congress: ‘కాంగ్రెస్’కు తాజా షాక్.. టీఆర్ఎస్ లో చేరనున్న ఎమ్మెల్యే వనమా!

  • ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకుంటా
  • టీఆర్ఎస్ నాయకత్వానికి మద్దతు పలుకుతున్నా
  • అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

‘కాంగ్రెస్’ ను ఆ పార్టీ సీనియర్ నేత ఆరేపల్లి మోహన్ వీడిన విషయం తెలిసిందే. ఆ షాక్ నుంచి ‘కాంగ్రెస్’ నేతలు ఇంకా తేరుకోక ముందే మరో షాక్ తగిలింది. కొత్తగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆ పార్టీని వీడనున్నట్టు తాజాగా ప్రకటించారు. టీఆర్ఎస్ లో త్వరలో చేరనున్నట్టు తెలిపారు.

ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవాలని నిర్ణయించుకున్నానని, సీఎం కేసీఆర్ పై విశ్వాసంతో టీఆర్ఎస్ నాయకత్వానికి మద్దతు పలుకుతున్నానని అన్నారు. తన నియోజకవర్గ ప్రజలను, కార్యకర్తలను సంప్రదించిన తర్వాతే టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అవసరమైతే, కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఖమ్మం జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఎంతోకాలంగా ఉన్న కొత్తగూడెం జిల్లా ఏర్పాటు డిమాండ్ ను కేసీఆర్ నెరవేర్చారని అన్నారు. 

t-congress
kothagudem
vanama
venkateswara rao
  • Loading...

More Telugu News