Telugudesam: గల్లా జయదేవ్ అన్న డైనమిక్...ఆయనలో ఫుల్ కరెంట్ ఉంది: నారా లోకేశ్ ప్రశంసలు

  • మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే  భయపడతారు
  • కానీ, అన్న గల్లా జయదేవ్ భయపడలా.
  • ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్..’ అంటూ కడిగి పారేశారు: లోకేశ్

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పై ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఎంపీ గారు కింగ్.. డైనమిక్. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే అందరూ భయపడతారు.

కానీ, అన్న భయపడలా. ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్.. మీరు చేసేది తప్పు. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు’ అని కడిగేసిన వ్యక్తి మన ఎంపీ జయదేవ్ అన్న. ప్రధాన మంత్రి గారికి బాగా కాలింది. ఆయన సమాధానం చెబుతూ ఓ మాట అన్నారు. ‘ఆ.. నీ దగ్గరకు కూడా వస్తా. నీ సంగతి కూడా చూస్తాను’ అని. కానీ, ఒక్క విషయం ఆయనకు (మోదీ) తెలియదు. ఈయనలో (గల్లా జయదేవ్) ఫుల్ కరెంట్ ఉంది. ఎందుకంటే, బ్యాటరీలు తయారు చేస్తారు కదా, ఫుల్ కరెంట్.

ఈయనతో పెట్టుకుంటే ప్రధాన మంత్రి కూడా షాక్ కు గురవుతాడు. అయినా, కూడా ఈయనపైన కావాలని కేసులు పెట్టారు. ఆయన కుటుంబసభ్యులపైనా   కేసులు పెట్టారు. యాక్టర్ మహేశ్ బాబు పైన జీఎస్టీ కేసు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. అంటే, మనకు అన్యాయం జరిగింది, న్యాయం చేయమంటే కేసులు పెడుతున్నారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. నలభై ఐదు రోజుల్లో ప్రధాన మంత్రి మారిపోబోతున్నారు. 25కు 25 పార్లమెంట్ స్థానాలను గెలిపించండి. భారత దేశ ప్రధాన మంత్రి ఎవరో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు నిర్ణయించబోతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీని, విభజన చట్టంలోని 18 హామీలను ఎవరైతే నిలబెట్టుకుంటారో వారినే ప్రధాన మంత్రిని చేయబోతున్నామని తెలియజేస్తున్నా’ అని లోకేశ్ వ్యాఖ్యానించారు.

Telugudesam
mp
galla jayadev
minister
nara lokesh
  • Loading...

More Telugu News