vishaka: అయినా భయపడం..బుల్లెట్ లా దూసుకెళ్తాం: సీఎం చంద్రబాబు

  • ఏపీ హక్కుల కోసం పోరాడుతున్నాం
  • ఈడీ, ఇన్ కంట్యాక్స్ దాడులు చేయిస్తున్నారు
  • ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే వదిలిపెట్టం

ఏపీ హక్కుల కోసం పోరాడుతున్న టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల పైనా ఈడీ, ఇన్ కంట్యాక్స్ దాడులు చేయిస్తున్నారని, అయినా భయపడమని, బుల్లెట్ లా దూసుకెళ్తామని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. విశాఖపట్టణంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు కావాల్సింది ఆంధ్రుల పౌరుషం, నవ్యాంధ్ర రోషం అని అన్నారు.

 నవ్యాంధ్రప్రదేశ్ లోని ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే వదిలిపెట్టమని హెచ్చరించారు. వైసీపీకి ఓట్లు వేస్తే కేంద్రానికి ఊడిగం చేస్తారని, అదే, టీడీపీకి ఓట్లు వేస్తే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని, ఈ విషయం గురించి ప్రజలు బాగా ఆలోచించాలని కోరారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపును ఏ శక్తీ ఆపలేదని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

vishaka
cm
Chandrababu
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News