Andhra Pradesh: టీడీపీ ప్రభంజనంలో వైసీపీ కొట్టుకుపోవాలి: సీఎం చంద్రబాబు

  • ఇంటికి పెద్దకొడుకుగా ఉండి ఆదుకుంటున్నా
  • వైసీపీకి ఓటేస్తే పులివెందులలా మారుతుంది
  • యువతను కూడా జగన్ జైలుకు తీసుకెళ్తాడు

త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనంలో వైసీపీ కొట్టుకుపోవాలని సీఎం చంద్రబాబునాయుడు పిలుపు నిచ్చారు. విశాఖపట్టణంలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో సుడిగాలి మాదిరిగా టీడీపీ ప్రభంజనం సృష్టించాలని అన్నారు. ఇంటికి పెద్దకొడుకుగా, పెద్దన్నగా ఉండి ఆదుకుంటున్నానని చెప్పారు.

 త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే రాష్ట్రం పులివెందులలా మారుతుందని ప్రజలంతా భయపడుతున్నారని, వైసీపీని నమ్ముకున్న యువతను కూడా జగన్ జైలుకు తీసుకెళ్తాడని విమర్శించారు. ఇలాంటి వాళ్లు అధికారంలోకి వస్తే ప్రతి ఊళ్లో నేరాలు జరుగుతాయని అన్నారు. పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా చంపారని పేర్కొన్నారు. ‘మీ ఇంట్లో జరిగిన హత్య మీకు తెలియకుండా జరిగిందా?’ అని జగన్ ని ప్రశ్నించారు. వివేకా మృతదేహానికి ఎవరికీ తెలియకుండా అంత్యక్రియలు చేయాలని అనుకున్నారని ఆరోపించారు. ఢిల్లీలో కాపలాదారు ఉన్నారని సీబీఐ దర్యాప్తు  అడుగుతున్నారని జగన్ పై మండిపడ్డారు.

Andhra Pradesh
elections
Telugudesam
YSRCP
jagan
Chandrababu
Visakhapatnam District
pulivendula
  • Loading...

More Telugu News