Andhra Pradesh: టీడీపీ ‘పసుపు-కుంకుమ’ యాడ్ పై రగడ.. ఎద్దును ఆవుగా చూపారని సోషల్ మీడియాలో ట్రోలింగ్!

  • ఎద్దుకు, ఆవుకు తేడా తెలియదా? అని సెటైర్లు
  • ఆడపడుచుకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వ్యంగ్యాస్త్రాలు
  • వైరల్ గా మారిన టీడీపీ ప్రచార వీడియో

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార టీడీపీ, విపక్ష వైసీపీ, బీజేపీల మధ్య మాటలయుద్ధం ముదురుతోంది. తాజాగా ‘పసుపు-కుంకుమ’ పథకంపై టీడీపీ పార్టీ రూపొందించిన యాడ్ లక్ష్యంగా వైసీపీ, బీజేపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ప్రకటనలో ఎద్దును ఆవుగా చూపారని వైసీపీ, బీజేపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలతో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

అసలు టీడీపీ నేతలకు ఎద్దుకు, ఆవుకు తేడా తెలియడం లేదా? అని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. నమ్మిన ఆడపడచుకు కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఎద్దేవా చేస్తున్నారు. కాగా, టీడీపీ విడుదల చేసిన ప్రచార వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News