RGV: సెన్సార్ బోర్డుపై కేసు పెడతా.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ను చట్టవిరుద్ధంగా అడ్డుకుంటున్నారు!: నిప్పులు చెరిగిన రామ్ గోపాల్ వర్మ

- ఎన్నికల కోడ్ ను సాకుగా చూపుతున్నారు
- ప్రక్రియను ఆలస్యం చేసే అధికారం బోర్డుకు లేదు
- ట్విట్టర్ లో స్పందించిన దర్శకుడు
తాను దర్శకత్వం వహించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు సర్టిఫికేషన్ ఇచ్చే విషయంలో సెన్సార్ బోర్డు కావాలనే తాత్సారం చేస్తోందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డుపై కేసు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఏపీలో పోలింగ్ ముగిసేవరకూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా సెన్సారింగ్ ను వాయిదా వేస్తామని బోర్డు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
