YSRCP: వివేకా హత్యకు కారణాలు జగన్ కు తెలుసు: టీడీపీ నేత వర్ల రామయ్య

  • కానీ, ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశారు
  • వివేకాకు ఓ మహిళ నుంచి మెసేజ్ వచ్చింది
  • బాబాయ్ హత్యను కూడా జగన్ రాజకీయం చేస్తున్నారు

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గల కారణాలు జగన్ కు తెలుసని, కానీ, ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశారని టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వివేకాకు అర్థరాత్రి 1.30 గంటలకు ఓ మహిళ నుంచి మెసేజ్ వచ్చిందని, మీ కూతురు వల్ల మా జీవితం నాశనం అయిందని, దానికి తగిన శిక్ష అనుభవిస్తావని ఆ మెసేజ్ లో ఉందని ఆరోపించారు. బాబాయ్ హత్యను కూడా జగన్ రాజకీయం చేస్తున్నారని, వాస్తవాలు బయటకు రాకుండా చేయడానికే సీబీఐ విచారణ కోరుతున్నారని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపిన అభ్యర్థుల్నే జగన్ ప్రకటించారని సెటైర్లు విసిరారు. జైల్లో ఉండాల్సిన వ్యక్తి, ఎన్నికల బరిలో ఉన్నాడంటూ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

YSRCP
viveka
Telugudesam
varla ramaiah
jagan
  • Loading...

More Telugu News