Andhra Pradesh: వైసీపీ వస్తే రావణకాష్టమేనన్న చంద్రబాబు.. ఇప్పుడేమన్నా రామరాజ్యం నడుస్తోందా? అంటూ సెటైర్ వేసిన ఐవైఆర్!

  • నిన్న తిరుపతి సభలో చంద్రబాబు నిప్పులు
  • మోదీ జగన్ ను కాపాడుతున్నారని వ్యాఖ్య
  • చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చిన బీజేపీ నేత

చిత్తూరు జిల్లా తిరుపతిలో నిన్న జరిగిన ఎన్నికల శంఖారావ సభలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపక్ష వైసీపీపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. జగన్ కు ఓటువేస్తే ఏపీ రావణకాష్టంగా మారుతుందని ఆయన ఆరోపించారు. జగన్ ను కాపలాదారైన మోదీ కేసుల నుంచి కాపాడుతున్నారని దుయ్యబట్టారు. వైసీపీ నేత వివేకానందరెడ్డి హంతకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వ్యంగ్యంగా స్పందించారు. వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం రావణకాష్టంగా మారుతుందని చంద్రబాబు చెప్పడంపై ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ఇప్పుడేదో రామరాజ్యం నడుస్తున్నట్లు’ అని వెటకారంగా ట్వీట్ చేశారు. దీనికి ఓ తెలుగు దినపత్రిక క్లిప్ ను ఐవైఆర్ జతచేశారు.

Andhra Pradesh
YSRCP
Jagan
Chandrababu
Telugudesam
iyr
BJP
  • Loading...

More Telugu News