Andhra Pradesh: విశాఖ నార్త్ నుంచి గంటా పోటీకి కారణమదే.. సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు!

  • ఉత్తరాన ఉన్న కొండలపై గంటా కన్నుపడింది
  • అవసరమైతే ఇప్పటికిప్పుడూ ఆయన వైసీపీలో చేరుతారు
  • ఏపీ మంత్రిపై విమర్శలు గుప్పించిన బీజేపీ నేత

టీడీపీ నేత, ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుపై బీజేపీ నేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలోని కొండలపై గంటా శ్రీనివాసరావు కన్నుపడిందని విష్ణుకుమార్ రాజు విమర్శించారు. అందుకే ఆయన నార్త్ నుంచి పోటీచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఒకవేళ విశాఖ నార్త్ లో వైసీపీ గెలుస్తుందని సర్వేల్లో తేలితే గంటా ఇప్పటికిప్పుడూ ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ఎద్దేవా చేశారు.

విశాఖపట్నంలో ఈరోజు మీడియాతో విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో జంప్ జిలానీ గంటా శ్రీనివాసరావు తనచేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి అధికారం అప్పగించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

Andhra Pradesh
Visakhapatnam District
Telugudesam
Ganta Srinivasa Rao
BJP
vishnukumar raju
  • Loading...

More Telugu News