Sunil Kumar: చర్చ్ లో పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్.. స్వయంగా వైద్యం చేస్తున్న భార్య మమతారాణి!

  • పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్
  • జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నం
  • తానూ డాక్టర్ నేనని పోలీసులకు గుర్తు చేసిన మమతారాణి

వైఎస్ జగన్ తనకు అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదన్న మనస్తాపంతో సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసి, ఆత్మహత్యాయత్నం చేసిన పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ కు ఆయన భార్య మమతారాణి స్వయంగా వైద్యం చేస్తున్నారు. నిన్న రాత్రి సెల్ఫీ వీడియోను సునీల్ కుమార్ పెట్టగానే దాన్ని చూసిన పోలీసు అధికారులు ముందుజాగ్రత్త చర్యగా కొందరిని ఆయన ఇంటికి పంపారు. పలమనేరులో సునీల్ నివాసం ఉండగా, సీఐ ఈదురు బాషా, ఎస్ఐ చంద్రమోహన్ ను తమ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లేసరికే ఇంటికి తాళాలు వేసివున్నాయి.

 దీంతో సునీల్ కు వారు కాల్ చేయగా, మమతారాణి లిఫ్ట్ చేశారు. తాము క్షేమంగా ఉన్నామని ఒకే ఒక్క మాట చెప్పి కాల్ కట్ చేశారామె. దీంతో వారి ఆచూకీకోసం విచారణ చేపట్టగా, ఓ చర్చ్ లో వారు ఉన్నట్టు తెలిసింది. అక్కడకు వెళ్లాగా, సునీల్ ఎడమచేతి మణికట్టుకు బ్యాండేజ్ కట్టివుంది. సెలైన్ ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు జరిగివున్నాయి. దీంతో సునీల్ ను ఆసుపత్రికి తీసుకెళ్లాలని పోలీసులు నిర్ణయించుకోగా, మమతారాణి అడ్డుకుని, తానుకూడా డాక్టర్ నేని, తన భర్తకు వైద్యం చేసుకుంటానని గట్టిగా చెప్పారు. దీంతో చేసేదేమీలేక, కొంతమంది పోలీసులను అక్కడ కాపలాగా పెట్టి వెళ్లిపోయారు.

Sunil Kumar
Mamata Rani
Putalapattu
YSRCP
Jagan
  • Loading...

More Telugu News