Adala: మాజీ మంత్రి ఇంటిపై రాత్రి వరకూ టీడీపీ జెండా... తెల్లారేసరికి వైకాపా పతాకం!

  • టీడీపీని వీడిన ఆదాల ప్రభాకర్ రెడ్డి
  • వైసీపీలో చేరగానే మారిపోయిన జెండా
  • ప్రజల్లో ప్రత్యేక చర్చ

అది నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి నివాసం. నిన్నటి వరకూ ఆయన ఇంటిపై కనిపించిన టీడీపీ జెండా, రాత్రికిరాత్రే వైకాపా పతాకంగా మారిపోయింది. రెండు రోజుల క్రితం వరకూ తెలుగుదేశం పార్టీలో కొనసాగిన ఆయన, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారన్న సంగతి తెలిసిందే. మూడు రోజుల నాడు చంద్రబాబు నాయుడు విడుదల చేసిన అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలోనే నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పేరును ప్రకటించినా, ఆయన పార్టీలో కొనసాగేందుకు విముఖత చూపారు. నిన్న ఆయన వైసీపీలో చేరిపోవడంతో, ఆయన అనుచరులు ఆ పార్టీ జెండాను ఎగుర వేయడంతో, చుట్టుపక్కల వారు ప్రత్యేకంగా చర్చించుకోవడం కనిపించింది.

Adala
YSRCP
Telugudesam
Flag
House
Nellore District
  • Loading...

More Telugu News