ys: వివేకా చనిపోయారని ఆయన బావమరిది నాకు ఫోన్ చేసి చెప్పారు: అవినాష్ రెడ్డి

  • మేము వెళ్లే సరికి వివేకా బాత్రూమ్ లో పడి ఉన్నారు
  • వెంటనే బయటకు వచ్చి పోలీసులకు సమాచారం అందించాము
  • మేము వెళ్లిన సమయంలో అక్కడ ఎలాంటి లేఖ లేదు

వైయస్ వివేకానంద హత్యపై అధికార, ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, వివేకా హత్య కేసును ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తోందని వైసీపీ మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. సరైన విచారణ జరపకుండా రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. వివేకా చనిపోయిన విషయం ఆయన బావమరిది తనకు ఫోన్ చేసి చెప్పారని తెలిపారు. తాము అక్కడకు వెళ్లేసరికి వివేకా బాత్రూమ్ లో పడి ఉన్నారని... వెంటనే బయటకు వచ్చి పోలీసులకు ఫోన్ చేసి చెప్పామని అన్నారు. తాము వెళ్లినప్పుడు అక్కడ ఎలాంటి లేఖ లేదని చెప్పారు. వివేకాది అనుమానాస్పద మృతి అని ముందుగానే చెప్పామని... విచారణ పారదర్శకంగా జరగాలని అన్నారు.

ys
viveka
avinash reddy
ysrcp
Telugudesam
letter
  • Loading...

More Telugu News