lal jan basha: గుంటూరులో టీడీపీకి షాక్.. గుడ్ బై చెప్పనున్న లాల్ జాన్ బాషా కుటుంబం

  • గుంటూరు తూర్పు అభ్యర్థిగా నసీర్ ను ప్రకటించడంపై ఆగ్రహం
  • గల్లాను అడ్డుకున్న లాల్ అనుచరులు
  • పార్టీని వీడే యోచనలో మరో నేత షౌకత్

గుంటూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాల్ జాన్ బాషా కుటుంబం టీడీపీని వీడే యోచనలో ఉంది. వీరితో పాటు సీనియర్ నేత షౌకత్ కూడా గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గుంటూరు తూర్పు అభ్యర్థిగా నసీర్ ను ప్రకటించడంపై వీరు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో లాల్ జాన్ బాషా కుటుంబం, షౌకత్ లు తమ అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సాయంత్రానికి వీరు ఓ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

విషయం తెలుసుకున్న ఎంపీ గల్లా జయదేవ్... లాల్ జాన్ బాషా కుమారుడి కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంలో గల్లాను లాల్ జాన్ బాషా వర్గీయులు అడ్డుకున్నారు.

lal jan basha
Telugudesam
guntur
galla
  • Loading...

More Telugu News