Dharmana Prasad: ఫినిష్ చేస్తానన్నారు.. కానీ, మనుషులనే లేకుండా చేస్తారని అనుకోలేదు: ధర్మాన

  • పోలీసులు చేయాల్సిన విచారణను కూడా చంద్రబాబే చేస్తున్నారు
  • పోలీసులు ఏం చేయాలో కూడా ఆయనే చెబుతున్నారు
  • ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు

వైయస్ వివేకానందరెడ్డికి శత్రువులు ఎవరూ లేరని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాష్ట్రంలో వైసీపీకి చెందిన బలమైన నేతలను హత్య చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు చేయాల్సిన విచారణను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబే చేస్తున్నారని విమర్శించారు. హత్య తర్వాత పోలీసులు ఏం చేయాలో కూడా చంద్రబాబే చెబుతున్నారని అన్నారు.

వివేకా హత్య కేసులో పరువు పోకముందే సీబీఐ చేత చంద్రబాబు విచారణ చేయించాలని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో లేనప్పుడు చంద్రబాబుకు సీబీఐ కావాలని... అధికారంలో ఉన్నప్పుడు మాత్రం రాష్ట్రంలో సీబీఐని అడుగుపెట్టనీయరని అన్నారు. ఫినిష్ చేస్తానని చంద్రబాబు అన్నారని... అయితే, మనుషులనే లేకుండా చేస్తారని మాత్రం అనుకోలేదని చెప్పారు.

Dharmana Prasad
Chandrababu
ys viveka
ysrcp
Telugudesam
  • Loading...

More Telugu News