Sangareddy District: నేడో, రేపో టీఆర్ఎస్ లో చేరనున్న జగ్గారెడ్డి?

  • అనుచరులు, సన్నిహితులతో జగ్గారెడ్డి సమావేశం
  • స్విచ్ఛాఫ్ లో జగ్గారెడ్డి ఫోన్
  • జగ్గారెడ్డి ‘కాంగ్రెస్’ను వీడతారన్న అనుమానాలకు బలం

సంగారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆ పార్టీని వీడనున్నట్టు తెలుస్తోంది. నేడో, రేపో టీఆర్ఎస్ లో చేరనున్నట్టు జగ్గారెడ్డి వర్గీయుల సమాచారం. ఈ నేపథ్యంలో సంగారెడ్డిలో తన అనుచరులు, సన్నిహితులతో జగ్గారెడ్డి సమావేశమైనట్టు తెలుస్తోంది. జగ్గారెడ్డితో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనకు ఫోన్ కాల్స్ చేస్తున్నప్పటికీ, లైన్ కలవడంలేదట. జగ్గారెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో టీఆర్ఎస్ లో ఆయన చేరతారన్న అనుమానాలకు మరింత బలం చేకూరినట్టయింది.

Sangareddy District
congress
jagga reddy
TRS
  • Loading...

More Telugu News