galla jayadev: గల్లా జయదేవ్ కు షాక్ ఇచ్చిన మైనార్టీ నేత

  • టీడీపీకి గుడ్ బై చెప్పిన అల్తాఫ్
  • జనసేనలో చేరిక
  • గల్లా జయదేవ్ ఓటమే లక్ష్యంగా పని చేస్తానంటూ వ్యాఖ్య

ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో అన్ని పార్టీల నుంచి వలసలు ఊపందుకున్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. నాయకులే కాకుండా, అనుచరులు కూడా జపింగ్ జపాంగ్ అంటున్నారు.

తాజాగా గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు ఆయన ప్రధాన అనుచరుడు, మైనార్టీ నేత అల్తాఫ్ షాక్ ఇచ్చారు. టీడీపీకి గుడ్ బై చెప్పారు. జనసేన నేత తోట చంద్రశేఖర్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అల్తాఫ్ మాట్లాడుతూ, గల్లా జయదేవ్ ఓటమే లక్ష్యంగా పని చేస్తానని చెప్పారు. జనసేన తనకు ఎలాంటి బాధ్యతలను అప్పగించినా సమర్థవంతంగా పని చేస్తానని... జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

galla jayadev
althaf
Telugudesam
janasena
  • Loading...

More Telugu News