Andhra Pradesh: రాజకీయ లబ్ధి కోసం జగన్ బాబాయిని కూడా వదిలిపెట్టలేదు!: చింతమనేని ప్రభాకర్ ఘాటు విమర్శలు

  • రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ వ్యాఖ్యలు
  • టీడీపీ నేతలను లాగేందుకు ప్రయత్నిస్తున్నారు
  • జగన్ శవరాజకీయాలు చేస్తున్నారు

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ పై తనకు నమ్మకం లేదని వైసీపీ అధినేత జగన్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. తన తాత రాజారెడ్డి, బాబాయ్ వివేకానందరెడ్డి చనిపోయిన సందర్భాల్లో చంద్రబాబే రాష్ట్రంలో సీఎంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కాగా, జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘాటుగా స్పందించారు.

రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ అధినేత ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. ఏదో కారణంతో జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్యకు గురైతే, ఆ వివాదంలోకి చంద్రబాబును, టీడీపీ నేతలను లాగేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబానికి అండగా నిలవాల్సిందిపోయి జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయ లబ్ధి కోసం జగన్ తన బాబాయిని సైతం వదిలిపెట్టలేదని విమర్శించారు. ఈ దుర్ఘటన వెనకున్న నిజాలన్నీ త్వరలోనే సిట్ విచారణలో బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
YSRCP
Jagan
Chinthamaneni Prabhakar
Telugudesam
comments
ys vivekananda reddy
  • Error fetching data: Network response was not ok

More Telugu News