Karnataka: కోర్టులో పదేపదే నవ్విన ఎమ్మెల్యే.. సీరియస్ అయిన న్యాయమూర్తి

  • బీజేపీ ఎమ్మెల్యేకి చేదు అనుభవం
  • కోర్టులో ఎలా ఉండాలో తెలుసుకోవాలని హెచ్చరిక
  • క్షమాపణ చెప్పించిన న్యాయవాదులు

కర్ణాటకలోని దేవదుర్గ బీజేపీ ఎమ్మెల్యే శివానగౌడ నాయక్‌కు కోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఓ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరైన ఆయన హాల్లో పదేపదే నవ్వడాన్ని గమనించిన న్యాయమూర్తి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధి అయివుండి కోర్టులో ఎలా వ్యవహరించాలో తెలియకపోతే ఎలా? అని మందలించారు. కాసేపు కోర్టు కస్టడీలో ఉండాలని ఆదేశించారు. దీంతో వెంటనే శివానగౌడ నాయక్‌ న్యాయవాదులు జోక్యం చేసుకుని తమ క్లయింట్‌ చేసింది తప్పేనని, ఇకపై పునరావృతం కాదని న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పించడంతో ఆయన శాంతించారు.

Karnataka
BJP MLA
court custady
  • Loading...

More Telugu News