Andhra Pradesh: టీడీపీకి ఝలక్.. బీజేపీ తీర్థం పుచ్చుకున్న బద్వేలు సిట్టింగ్ ఎమ్మెల్యే జయరాములు!

  • దేశాన్ని కాపాడే ఏకైక పార్టీ బీజేపీయే
  • మోదీకి ప్రజలు మరోసారి అధికారమిస్తారు
  • అధిష్ఠానం ఆదేశిస్తే బద్వేలు నుంచి పోటీచేస్తా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వలసలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా టీడీపీ నేత, బద్వేలు సిట్టింగ్ ఎమ్మెల్యే జయరాములు టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి బద్వేలు టికెట్ ను ఓబులాపురం రాజశేఖర్ కు కేటాయించిన నేపథ్యంలోనే జయరాములు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

బీజేపీలో చేరిక అనంతరం జయరాములు మీడియాతో మాట్లాడుతూ.. దేశాన్ని కాపాడగలిగే ఏకైక పార్టీ బీజేపీయేనని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి దేశప్రజలు మరోసారి పట్టం కట్టబోతున్నారని జోస్యం చెప్పారు. బీజేపీ అధిష్ఠానం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని తెలిపారు. ఒకవేళ అధిష్ఠానం ఆదేశిస్తే బద్వేలు నుంచి పోటీచేస్తానని ప్రకటించారు.

Andhra Pradesh
Kadiam Srihari
badwel
jayaramulu
Telugudesam
BJP
  • Loading...

More Telugu News