Crime News: కన్నతల్లిని హింసిస్తున్న కొడుకు... అల్లుడితో కలసి హత్య చేసిన తల్లి

  • రోజూ తాగి వచ్చి చేస్తున్న గొడవలతో విసిగిపోయిన తల్లి
  • భరించలేక అల్లుడితో కలిసి దారుణం
  • నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

నవమాసాలు కడుపున మోసి కనిపెంచి పెద్ద చేసిన కొడుకునే చేతులారా హత్యచేసిందా తల్లి. మద్యానికి బానిసైన కొడుకు రోజూ తాగివచ్చి పెడుతున్న ఇబ్బందులు భరించలేక ఆమె తన కడుపుతీపిని చంపుకుంది. అటువంటి కొడుకు ఉండే కంటే లేకపోతేనే ప్రాణానికి హాయిగా ఉంటుందని భావించింది. అల్లుడితో కలిసి కొడుకు శ్రీను (25)ను హత్యచేసింది. హైదరాబాద్‌ ఫిలింనగర్ నవనిర్మాణ్‌నగర్‌లో ఈ దారుణం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని సందర్శించి నిందితులు నారాయణమ్మతోపాటు ఆమె అల్లుడు కేశవులను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Crime News
son murdered
Hyderabad
filmnagar
  • Loading...

More Telugu News