Andhra Pradesh: జగన్ కు భద్రతను పెంచండి.. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి!: అవంతి శ్రీనివాస్

  • వివేకానందరెడ్డి హత్య షాక్ కు గురిచేసింది
  • ప్రతిపక్షాలకే రక్షణ లేకుంటే సామాన్యుల సంగతేంటి?
  • ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ వైసీపీ నేత

వైఎస్ వివేకానందరెడ్డి హత్య తమను షాక్ కు గురిచేసిందని వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రతిపక్ష నేతలకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ కు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కోరారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం హత్యారాజకీయాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Andhra Pradesh
Telugudesam
Chandrababu
YSRCP
Jagan
ys vivekananda reddy
Congress
avanti srinivas
  • Loading...

More Telugu News