Telangana: తెలంగాణ ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు కేకు తినిపించిన కేటీఆర్!

  • నేడు శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు
  • స్వయంగా మంత్రి ఛాంబర్ కు వచ్చిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
  • శ్రీనివాస్ గౌడ్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్ష

తెలంగాణ ఎక్సైజ్, యువజన సేవల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మంత్రి ఛాంబర్ కు వెళ్లిన కేటీఆర్ శ్రీనివాసగౌడ్ కు కేకు తినిపించారు.

అనంతరం ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ఉత్సాహవంతంగా, చురుగ్గా ఉండే గౌరవనీయులైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో, మరింతకాలం ప్రజాసేవలో కొనసాగాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. శ్రీనివాసగౌడ్ కు కేక్ తినిపిస్తున్న ఫొటోను ఈ సందర్భంగా కేటీఆర్ తన ట్వీట్ కు జతచేశారు.

Telangana
TRS
srinivas goud
birthday
wishes
Twitter
KTR
  • Loading...

More Telugu News