Andhra Pradesh: వైసీపీ రౌడీలు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కూడా కాలరాస్తున్నారు!: నారా లోకేశ్ ఆగ్రహం

  • కర్నూలు జిల్లాలో వైసీపీ-టీడీపీ వర్గాల ఘర్షణ
  • టీడీపీ నేత తిక్కారెడ్డిపై బాలనాగిరెడ్డి వర్గీయుల దాడి
  • వైసీపీ నేతల తీరుపై తీవ్రంగా మండిపడ్డ ఏపీ మంత్రి

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం ఖగ్గల్ లో ఈరోజు టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో టీడీపీ నేత తిక్కారెడ్డి, ఏఎస్ఐ వేణుగోపాల్ కు బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలపై ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా వైసీపీ రౌడీలు కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈరోజు ట్విట్టర్ ద్వారా నారా లోకేశ్ స్పందిస్తూ.. ‘మంత్రాలయంలో పార్టీ జెండా ఎగరేయడానికి వెళ్ళిన టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటనలో తిక్కారెడ్డితో పాటు మరో ఏఎస్ఐ గాయపడ్డారు. ఎన్నికల ప్రచారం చేసుకోవడమనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని కూడా కాలరాస్తున్నారు ఈ వైసీపీ రౌడీలు’ అని మండిపడ్డారు. ఈ సందర్భంగా దాడికి సంబంధించిన ఫొటోలను తన ట్వీట్ కు లోకేశ్ జతచేశారు.

Andhra Pradesh
Chandrababu
YSRCP
Telugudesam
Nara Lokesh
Kurnool District
tikkareddy
balanagireddy
Twitter
  • Loading...

More Telugu News