Khammam District: ఆ అవసరం లేదు...పార్టీ మార్పుపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు క్లారిటీ

  • సీరియస్‌గా స్పందించిన ఖమ్మం నేత
  • తప్పుడు ప్రచారంపై మండిపాటు
  • తుది శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టీకరణ

సార్వత్రిక ఎన్నికల తరుణంలో పార్టీ వీడుతున్న వారితో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న తెలంగాణ కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఖమ్మం జిల్లా సీనియర్‌ నేత, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఊరటనిచ్చే మాటలు చెప్పారు. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్న వార్తలు ఇటీవల జోరుగా షికారు చేస్తున్న నేపథ్యంలో వాటిపై  వివరణ ఇచ్చారు. పార్టీ మారాల్సిన అవసరం తనకేమొచ్చిందని ఎదురు ప్రశ్నించారు. ఎవరో కావాలని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీ మారడం లేదని, తుది శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

Khammam District
kothagudem
MLa vanama
  • Loading...

More Telugu News