chandrababu: భర్తకు దిష్టి తీసి ప్రచారానికి సాగనంపిన భువనేశ్వరి!

  • ఉండవల్లి నుంచి తిరుమలకు బయల్దేరిన చంద్రబాబు
  • అక్కడి నుంచి నేరుగా శ్రీకాళహస్తికి వెళ్లనున్న సీఎం
  • శ్రీకాళహస్తి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సాయంత్రం ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్నారు. ఈ ఉదయం ఉండవల్లిలోని నివాసం వద్ద చంద్రబాబుకు ఆయన భార్య భువనేశ్వరి కొబ్బరికాయతో దిష్టి తీశారు. ఆయనకు ఎదురు వచ్చి ఎన్నికల ప్రచారానికి సాగనంపారు. ఉండవల్లి నుంచి హెలికాప్టర్ లో ఆయన తిరుపతికి బయల్దేరారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లి, శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా శ్రీకాళహస్తికి వెళతారు. అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు.

chandrababu
bhuvaneswari
Telugudesam
  • Loading...

More Telugu News