Jagan: వివేకా హత్య ఎఫెక్ట్: నేటి జగన్ ఎన్నికల ప్రచారం రద్దు

  • ప్రస్తుతం పులివెందులలోనే జగన్
  • రేపటి నుంచి నాలుగు రోజులపాటు ప్రచారం
  • పిడుగురాళ్ల నుంచి ప్రారంభించనున్న వైసీపీ చీఫ్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం నేపథ్యంలో నేటి ఎన్నికల ప్రచార సభను వైసీపీ అధినేత వైఎస్ జగన్ రద్దు చేసుకున్నారు. నేడు ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని జగన్ భావించారు. అనంతరం గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని తొలుత నిర్ణయించారు. అయితే, వివేకా హత్య తర్వాత పులివెందుల చేరుకున్న జగన్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో నేటి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.  

రేపటి (ఆదివారం) నుంచి జగన్ వరుసగా నాలుగు రోజులపాటు ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్నట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. ఆదివారం విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న జగన్ 18న పాణ్యం నియోజకవర్గంలో, 19న పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో, 20న నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ కేంద్రంలో‌ ప్రచారం నిర్వహిస్తారు.

Jagan
Pulivendula
Kadapa District
Election
Andhra Pradesh
  • Loading...

More Telugu News